84 రోజుల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచిన ఎయిర్‌టెల్

  • రూ.859 నుంచి రూ.899కి సవరించిన ఎయిర్‌టెల్
  • రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌పై రూ.40 అదనపు భారం
  • రూ.799 ప్లాన్‌ను తొలగించిన ఎయిర్‌టెల్
ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రూ.859కి 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరను రూ.899కి సవరించింది. ఈ పెంపుకు సంబంధించి వినియోగదారులకు ముందస్తు సమాచారం రాలేదు. దీనితో క్రమం తప్పకుండా ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేసుకునే వారికి ఇప్పుడు రూ.40 అదనపు భారం పడుతుంది. ధరను పెంచినప్పటికీ, ఎలాంటి అదనపు ప్రయోజనాలు జతచేయలేదు.

రూ.899తో 84 రోజుల వ్యాలిడిటీ కోసం రీఛార్జ్ చేస్తే రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు, ఎయిర్‌టెల్ ఫ్రీ హలోట్యూన్ ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉండగా రోజుకు 1.5 జీబీ డేటాతో 77 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.799 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ ధరలు పెంచింది.

Airtel price hike
Airtel removes its Rs 799 plan

More Telugu News